
హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కవిత వ్యాఖ్యలకు బిఆర్ఎస్ కు సంబంధం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్ చేరతానన్న ప్రచారంలో అవాస్తవం అని తెలియజేశారు. కవిత చేస్తున్న విమర్శలకు బిఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు అవినీతి, అక్రమాలను ఆదరించరని అన్నారు. బిజెపి నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయం ఓటు బ్యాంకు పెంచుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.