
హైదరాబాద్: సమాజం సుభిక్షంగా ఉండాలంటే.. విద్య, వైద్యం బాగుండాలని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. విద్య, వైద్యంలో మెరుగ్గా ఉంటేనే.. సమ్మిళిత సాధించినట్లు అని అన్నారు. కోటి మెడికల్ కళాశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ఎంపికైన ల్యాబ్ టెక్నిషియన్లకు నియామకపత్రాలు అందజేశారు. వైద్యారోగ్యశాఖలో 1.257 గ్రేడ్-2 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు భర్తీ పూర్తి చేశారు. ఎంపికైన వారికి నియామకపత్రాలు మంత్రి దామోదర అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ సందర్భంగా ఆయన మీడియాతో దామెదర మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖలో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ చేశామని, భవిష్యత్ లో మరో 10 వేల పోస్టులు భర్తీ చేయనున్నామని తెలియజేశారు. చికిత్సలో డాక్టర్ల పాత్ర ఎంత ముఖ్యమో.. ల్యాబ్ టెక్నిషియన్లు, పరికరాలు కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు కావాల్సినన్ని నిధులను సిఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నారని, ప్రతి జిజిహెచ్ లో డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
రోగులు ప్రతి చిన్న చికిత్సకు హైదరాబాద్ లోని పెద్ద ఆస్పత్రులకు వచ్చే పరిస్థితి ఉండొద్దని సూచించారు. ఎక్కువ చికిత్సలు మండల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో జరగాలని, బాల భరోసా అనే పథకానికి సిఎం శ్రీకారం చుట్టారని కొనియాడారు. అన్ని ఉద్యోగాలు ఒక ఎత్తు.. విద్య, వైద్యంలో విధులు మరో ఎత్తు అని..వారంలో రోజుకొక ప్రత్యేక వైద్య నిపుణుడు పాలీ క్లినిక్ లో ఉంటారని చెప్పారు. చిత్తశుద్ధి అంకితభావం లేకుంటే.. విద్య, వైద్య వృత్తిలో న్యాయం చేయలేమని, జాతీయ రహదారుల వెంట ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ప్రతి 30- 40 దూరానికొక ట్రామాకేర్ సెంటర్ ఉండాలని, రూ.7200 కోట్ల నిధులతో ఉస్మానియా కొత్త ఆస్పత్రిని నిర్మించనున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీలో 1835 చికిత్సలు ఉన్నాయని, పేదవాడి సంక్షేమం, ఆరోగ్యభద్రత ప్రభుత్వానిదేనని, వైద్యానికి ప్రైవేటులో శక్తికి మించి ఖర్చు చేసి.. ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్లకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమాజానికి సేవ చేయాలనే తపన ప్రతి ఉద్యోగిలో ఉండాలని, వైద్యశాఖలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ రావాలని అన్నారు. అన్ని ఆస్పత్రులను అనుసంధానిస్తూ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండాలని దామోదర నరసింహ స్పష్టం చేశారు.