Reading Time: < 1 minute

సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సినిమాలో త్రిప్తి మెయిన్ హీరోయిన్‌గా చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ‘స్పిరిట్’ కోసం ముందుగా దీపికని అనుకున్నారు. అయితే పని గంటలు, రెమ్యునరేషన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకుంది. దాంతో సందీప్ రెడ్డి వంగ ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడు. ఇక విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఓ రోమియో మూవీలో షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో షాహీద్‌కు జోడీగా ముందు దీపకనే అనుకున్నారట. అది లేడీ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. అయితే తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా దీపిక… ఓ రోమియో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, తన స్థానంలో త్రిప్తిని తీసుకున్నారని తెలిసింది. ఈవిధంగా దీపిక రెండు ప్రాజెక్ట్‌లను త్రిప్తి డిమ్రి సొంతం చేసుకోవడం విశేషం.