Reading Time: < 1 minute

ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మర్దానీ 3’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో వృత్తిలో రాజీ పడకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ కనిపించనున్నారు. దేశంలో అదృశ్యమైపోతున్న అనేక మంది బాలికలను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. ఈ మర్దానీ 3లో రాణీ ముఖర్జీ పాత్రను ఎదిరించే క్రూరమైన విలన్ రోల్‌లో ప్రముఖ నటి మల్లికా ప్రసాద్ నటించారు. ఈ చిత్రానికి ది రైల్వే మెన్ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆయుష్ గుప్తా కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రైలర్‌తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. మర్దానీ 3 చిత్రానికి అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 30న విడుదల చేస్తున్నారు.