Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: జిల్లాల పునర్విభజన పై రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తామని సిఎం రేవంత్ రె డ్డి అన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రజల్లో వ్యతిరే క త వస్తున్నందున నియోజకవర్గాల పునర్విభజన మా దిరిగానే జిల్లాల పునర్విభజనపై బడ్జెట్ సమావేశా ల్లోగా కమిషన్ వేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల డైరీ 2026 ని సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని ఆరోపిం చారు. దాని వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని విమర్శించారు. వరంగల్, హనుమకొండ జి ల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంద ని, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామ ని ఆయన తెలిపారు. ఈ కమిషన్ ఆరు నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్‌పై నివేదిక సమర్పిస్తుందన్నారు.

అన్ని జిల్లా ల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రానున్న బడ్జె ట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధివిధానాలు రూ పొందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ నివేది క ఆధారంగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని, ఉద్యోగులే తమ సారధులు, వారధులని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు మొత్తం కలిసి తాము 200 మందిమి కూడా లేమని, రాష్ట్రాన్ని 10 లక్షల మంది ఉద్యోగులు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కింద రూ.కోటి ఇస్తామని ఆయన హామీనిచ్చారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల హక్కు అని ఆయన తెలిపారు. ప్రతి నెలా 100 మంది రిటైర్ అవుతున్నారని, ఒక్కొక్కరిపై రూ.కోటి భారం పడుతోందని, డిఏ పెంపుతో ప్రతి నెలా రూ.220 కోట్ల భారం పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రతి నెలా రూ.22 వేల కోట్లు ఖర్చు

ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా అమలు చేసేది ఉద్యోగులేనని, ప్రభుత్వం, ఉద్యోగులు ఒక కుటుంబమని, మీరు, మేము వేర్వేరు కాదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు పట్టించుకోవద్దని, కడుపులో విషం పెట్టుకొని కొందరు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫాంహౌస్‌లో ఒకాయన ఉంటే అసెంబ్లీలో మరో ఇద్దరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి పెద్ద దిక్కు గా ఉండాల్సిన వ్యక్తి ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్‌మెంట్, పెన్షన్, మెడికల్ బిల్లులు చెల్లించలేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే వాటిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామని ఆయన తెలిపారు. ప్రతి నెలా రూ.22 వేల కోట్లు ఖర్చు పెట్టాలని, రెవెన్యూ మాత్రం రూ.30 వేల కోట్లు మాత్రమే వస్తుందని ఆయన అన్నారు.

ప్రతిసారి దివాలా తీశామని చెప్పుకోవడం కరెక్ట్ కాదు

ఉద్యోగులకు సంబంధించి ఒక డిఏ ఫైల్ మీద ఈరోజు (జనవరి 12) ఉదయం సంతకం పెట్టానని, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున ఉద్యోగులకు నా నోటి నుంచి శుభవార్త వస్తుందని ఎదురుచూస్తారని అందుకే ఒక డిఏకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చానని ఆయన తెలిపారు. మ ప్రభుత్వంలో జీతాలు మొదటి తేదీనే వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ రెండు సంవత్సరాలు బకాయిలు రాక ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని, గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ఉద్యోగులు అమలు చేశారని, ప్రతిసారి దివాలా తీశామని చెప్పుకోవడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.సిఎం పదవి వస్తే సంతోషం అనుకున్నానని, సిఎం అయ్యాక బరువు, బాధ్యతలు పెరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఉద్యోగులకు ఇన్యూరెన్స్, హెల్త్‌కార్డు మీద చర్చలు

పిసిసి చీఫ్‌గా 12 గంటలు కష్టపడ్డానని ఇప్పుడు ఇంకా ఎక్కువ గంటలు కష్టపడుతున్నానని ఆయన తెలిపారు. తాను అంటే ఉద్యోగులకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇన్యూరెన్స్ ఇస్తుందని, హెల్త్‌కార్డు మీద చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తామని, ఎక్కువ బిల్లులను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని ఆయన అన్నారు.