
మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో మా హీరోయిన్స్ చాలా అందంగా కనిపిస్తారు. నన్ను కూడా చాలా అందంగా చూపించాడు డీవోపీ ప్రసాద్ మూరెళ్ళ. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి సినిమాని చాలా పాషన్‌తో చేశారు.
బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్టర్ కిషోర్ ఈ సినిమాతో చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఫన్‌రైడ్‌లా ఉంటుంది’ అని అన్నారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ‘జనవరి 13న మా బీఎండబ్ల్యూ(భర్త మహాశయులకు విజ్ఞప్తి) రైడ్‌కి వెళ్ళండి. కచ్చితంగా అదిరిపోతుంది’ అని పేర్కొన్నారు. మూవీ డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి యాక్టర్ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను‘ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, బాబీ, శివ నిర్వాణ, పవన్, హీరోయి న్లు డింపుల్ హయతి, ఆశిక రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.