Reading Time: < 1 minute

మలి వయసులో మౌనంగా ఉండడం నేర్చుకో

మన చుట్టూ అవసరాన్ని బట్టే

మనుషులు చేరతారు

మనతో అవసరం తీరాక

మనుషుల తీరే మరోలా మారుతుంది

మనల్ని చూసే, మనల్ని పలకరించే తీరే

చిత్రంగా మారుతుంది

మలి వయసులో మౌనంగా ఉండడాన్ని నేర్చుకో

కొన్నిటిని చూసినా ప్రశ్నించకుండా ఉండాలి

కొన్ని తెలిసినా తెలియనట్టు నటించాలి

కొన్ని బాధించినా, భరించటం నేర్చుకోవాలి

మరి ఇక మాట్లాడక తప్పదని

తేలిపోయినప్పుడు మాత్రమే,

క్లుప్తంగా, ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడాలి

మనసులో దాగిన మాటలను నిద్రపుచ్చి

అన్నీ తెలిసినా, వీలైనంత

మౌనంగా ఉన్నప్పుడే నేమో

మలి వయసు మనసుకు ప్రశాంతత దక్కుతుంది

అప్పుడే తామరాకుపై నీటి చుక్కల వలే

ఏదీ పెద్దగా మనసుకు అంటకుండా

జీవించటం అలవడుతుంది

అన్నీ తెలిసినా, బాధ మనలో

ఇంకకుండా, కొంత ఎడంగా

మౌనంగా, ప్రశాంతంగా ఉండడం

ఏమిటో తెలుస్తుంది

-కె.గోపాల్‌రెడ్డి