
హైదరాబాద్: దివంగత మాజీ సిఎం రోశయ్య సతీమణి శివ లక్ష్మి (86) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో అమీర్ పేటలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శివ లక్ష్మి మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. రోశయ్య కూడా 2021 డిసెంబర్ 4న కన్నుమూశారు. ఉమ్మడి ఎపికి ముఖ్యమంత్రి, తమిళనాడుకు రోశయ్య గవర్నర్ సేవలందించారు. ఈ దంపతులు ముగ్గురు సంతానం కె. ఎస్. సుబ్బారావు, పి. రమాదేవి, కె. ఎస్. ఎన్. మూర్తి ఉన్నారు.