
న్యూయార్క్: వెనుజులా తాత్కాలిక అధ్యక్షడిగా డోనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. సోషల్ మీడియా ట్రూత్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టు పెట్టాడు. వెనెజులాపై అగ్రరాజ్యం అమెరికా జనవరి 3న తెల్లవారుజామున భారీ స్థాయిలో వైమానిక సైనిక దాడులకు దిగింది. అత్యంత అసాధారణ సైనిక చర్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక బలగాలు చేపట్టాయి. దాడికి దిగడమే కాకుండా, గంటల వ్యవధిలోనే వెనెజులా అధ్యక్షులు నికోలాస్ మదురోను ఆయన సతీమణిని సైన్యం బంధించి అమెరికాకు తీసుకెళ్లారు. దంపతులకు చేతులకు సంకెళ్లు వేసి, అమెరికా యుద్ధనౌకలో న్యూయార్క్‌కు తరలించారు.
అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమరవాణా, అమెరికాలో వెనెజులా సిండికేట్ల ఏర్పాటు , ఏకంగా నార్కో టెర్రరిజం ఆరోపణలపైనే మదురోనే టార్గెట్ చేసుకునే ట్రంప్ ఈ వ్యూహాత్మక దాడులకు దిగినట్లు వెల్లడైంది. వేలాదిగా వెనుజులా వాసులు అమెరికాలోకి అక్రమంగా చేరుకుంటున్నారని, వీరితో తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ప్రెసిడెంట్ ట్రంప్ చాలాసార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.