Reading Time: < 1 minute
Sobhita Dhulipala Clarity On Career Post Marriage With Naga Chaitanya

అక్కినేని కోడలిగా మారిన తర్వాత నటి శోభితా ధూళిపాళ తొలిసారిగా తన కెరీర్.. వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో వివాహం జరిగి ఏడాది గడుస్తున్నా, పరిశ్రమలో తన పట్ల చూసే దృక్పథంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదని ఆమె స్పష్టం చేశారు. “నా కెరీర్ ఆరంభం నుండి నేటి వరకు ప్రతి అడుగు నా స్వతంత్ర పోరాటమే. ఒక గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టిన మాట వాస్తవమే అయినా, నా పని.. కుటుంబం ఎప్పుడూ వేర్వేరు. నా అత్తమామలను నేను కేవలం కుటుంబ సభ్యులుగా మాత్రమే చూస్తాను కానీ, ఇండస్ట్రీ వ్యక్తులుగా కాదు’ అని శోభిత చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చారు.

Also Read : Happy Birthday Brahmanandam: మీమ్స్ రాజు.. నవ్వుల రారాజు..హాస్య బ్రహ్మ బ్రహ్మానందం బర్త్ డే ..

ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో కేవలం గ్లామర్‌గా కనిపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కథను మలుపు తిప్పే బలమైన పాత్రలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే మహిళా క్యారెక్టర్లకే నేను ప్రాధాన్యత ఇస్తా. అలాగే  పాత్ర మంచిదా చెడ్డదా అనే దానికంటే, ఆ పాత్రకు కథలో ఎంత ప్రాముఖ్యత ఉందనేదే చూస్తా. ఎవరి సపోర్ట్ లేకుండా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఈ స్థాయికి వచ్చాను, భవిష్యత్తులో కూడా నా సొంత నిర్ణయాలతోనే కెరీర్‌లో ముందుకు సాగుతా’ అని శోభితా ధూళిపాళ తన మనసులోని మాటను బయటపెట్టారు.