Reading Time: < 1 minute
Budget 2026 Fiscal Deficit Estimated 4 Point 3 Percent Gdp Fy27

Budget 2026: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు (Fiscal Deficit) కేంద్రం అంచనా వేసింది. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026లో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

Read Also: Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ శుభవార్త..

ద్రవ్యలోటు అనేద ప్రభుత్వ మొత్తం ఖర్చులను, మొత్తం ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. లోటు తక్కువగా ఉంటే కఠినమైన, క్రమబద్ధమైన ఆర్థిక నిర్వహణ ఉన్నట్లు భావిస్తారు. 2026-27 కోసం నిర్ధారించిన 4.3 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మెరుగుగా ఉండటంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం వైపు కేంద్రం కట్టుబడి ఉందని సూచిస్తోంది. పెట్టుబడి ఆధారిత వృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తూనే, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.