Reading Time: < 1 minute

హైదరాబాద్: భారత ఒలంపిక అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపి పిటి ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో శ్రీనివాసన్ కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీంతో పిటి ఉష కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.