
తిరుపతి: తిరుమల కొండపై ఫొటో షూట్ చేసిన జంట క్షమాపణలు కోరింది. నూతన వధువరులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేశారు. క్షమాపణలు కోరుతూ తమిళనాడు రాష్ట్రం తిరువన్నమలై చెందిన తిరుమల్, గాయత్రి దంపతుల వీడియో విడుదల చేశారు. శ్రీవారి సేవ చేసి తప్పును సరిచేసుకుంటామని దంపతులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో ఫొటో షూట్ జరిగింది. శ్రీవారి ఆలయం ఎదుట నూతన వధువరులు నుదిటిపై ముద్దులు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు షూటింగ్ చేశారు. భద్రతా సిబ్బంది స్పందించకపోవడంపై విమర్శలు వచ్చాయి.