Reading Time: 3 minutes

 2025-26 జిడిపి అంచనా 7.4 శాతం

వచ్చే ఆర్థిక సంవత్సరం జిడిపి అంచనా 7.2%

భారత రూపాయి ఆశించిన స్థాయిలో బలపడలేదు

ద్రవ్య లోటు జిడిపిలో 4.౮ శాతానికి తగ్గింది

ఎఐతో ప్రమాదాలపై హెచ్చరికలు

పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ అవసరం

అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగం వేగంగా పెరుగుతోంది

గిగ్ కార్మికులకు కనీస వేతనం నిర్ణయించాలి

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025-26 ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ నిలకడగా పురోగతిని సాధిస్తోందని ఆర్థిక సర్వే 202526 వెల్లడించింది. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభించిన తర్వాత మరుసటి రోజు గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. సంస్కరణలు కొనసాగిస్తుండడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202627) జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉండనుంది. ఈ జిడిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202526) జిడిపి అంచనా 7.4 శాతం కంటే తక్కువగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతోంది. విధానపరమైన స్థిరత్వం, నియంత్రణలో స్పష్టత, మానవ వనరులపై పెట్టుబడులు భారత భవిష్యత్ వృద్ధికి కీలకంగా ఉన్నాయి.

భారీ మార్పులకంటే నిరంతర సంస్కరణలే భారత్‌ను ముందుకు నడిపిస్తాయని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. కొనుగోలు ప్రమాణాల ప్రకారం, ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 16 శాతం ఉండటం విశేషం. దీని వల్ల భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. అయితే, ప్రపంచ వాణిజ్యం మందగించడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం వల్ల వృద్ధి ఎక్కువగా దేశీయ డిమాండ్‌పైనే ఆధారపడుతోందని సర్వే హెచ్చరించింది. బ్యాంకులు, కార్పొరేట్ రంగం ఆర్థికంగా మెరుగవడం, ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం భారత్‌కు ప్రధాన బలం అని పేర్కొంది.

*విదేశీ మారక నిల్వలు 701.4 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నప్పటికీ, భారత రూపాయి ఆశించిన స్థాయిలో బలపడలేదని సర్వే తెలిపింది. 2020 తర్వాత ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి ఎక్కువగా నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం దేశంలో కరెంట్ ఖాతాలోటు, 2025-26లో ఇది జిడిపిలో సుమారు 1.3 శాతంగా ఉంది. సేవల రంగం నుంచి వచ్చే మిగులు ఆదాయం, విదేశాల్లో పనిచేసే భారతీయుల నుంచి వచ్చే రిమిటెన్సులు బాహ్య ఒత్తిడిని కొంత మేర తగ్గిస్తున్నాయని సర్వే తెలిపింది.

* కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగుపడిందని సర్వే తెలిపింది. 2024-25లో ద్రవ్య లోటు జిడిపిలో 4.8శాతానికి తగ్గింది. ఆ దాయ లోటు కూడా గణనీయంగా తగ్గింది. మొత్తం ప్రభుత్వ రుణం జిడిపిలో 82 శాతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత వృద్ధి పరిస్థితుల్లో అది నిర్వహించ గల్గినదే అ ని అంచనా వేసింది. అ యితే, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితిపై సర్వే ఆందోళన వ్యక్తం చేసిం ది. రాష్ట్రాల ద్రవ్య లోటు మళ్లీ 3 శాతం దాటింది. అధిక వ్యయాలు, సంక్షే మ పథకాల కారణంగా ఆదాయ లోటు పెరుగుతోంది. వడ్డీ చెల్లింపులు రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 18శాతం వా టా ఉన్నాయని సర్వే హెచ్చరించింది.

* 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం రెండింతలకుపైగా పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిం ది. జిడిపిలో ఈ వాటా 4 శాతానికి చేరడం రికార్ఢు స్థాయి అని సర్వే పేర్కొంది. ప్రైవేట్ పెట్టుబడులు కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నా యి. తయారీ రంగంలో సామర్థ్య వినియోగం 75 శాతాన్ని దాటిం ది. స్థూల స్థిర మూలధన నిర్మాణం జిడిపిలో 34శాతానికి పెరిగింది.

* చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకు రుణాలు 2025 నవంబర్ నాటికి 24.6శాతం పెరిగాయి. జిఎస్‌టి నమోదు చేసిన సంస్థ లు 1.5 కోట్లకు చేరాయి. అయితే, చెల్లింపుల ఆలస్యం ఇంకా ప్రధా న సమస్యగా ఉందని సర్వే తెలిపింది. ఉపాధి, ఉత్పత్తిలో ఈ రంగం కీలకమైనందున సమస్య పరిష్కారం అవసరమని సర్వే సూచించింది.

* నిరుద్యోగ రేటు 3.2 శాతానికి తగ్గిందని సర్వే తెలిపింది. మహిళల కార్మిక భాగస్వామ్యం 37 శాతానికి పైగా పెరిగింది. 2025-26 రెండో త్రైమాసికంలో 56.2 కోట్ల మంది ఉపాధిలో ఉన్నారు. అయితే, ఉపాధి నాణ్యత, నైపుణ్యాల లోపం ప్రధాన సవాలుగా ఉందని సర్వే పేర్కొంది.

* మొదటిసారిగా కృత్రిమ మేధస్సు(ఎఐ)పై ఆర్థిక సర్వే ప్రత్యేక అధ్యాయం కేటాయించారు. ఎఐ సేవల ఎగుమతులకు అవకాశాలు కల్పిస్తుంది. అయితే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించింది. ప్రపంచ ఎఐ ప్రతిభలో భారత్ వాటా 16 శాతంతో ఎక్కువగా ఉన్నప్పటికీ, పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి. సరైన విధంగా వినియోగిస్తే ఎఐ వృద్ధిని గణనీయంగా పెంచగలదని అంచనా వేసింది.

* పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే దిశగా సర్వే కొన్ని విషయాలు చెప్పింది. ఆన్‌లైన్ వేదికల వినియోగంలో వయసు నిబంధనలు పరిగణించాలని, డిజిటల్ వ్యసనాన్ని నియంత్రించేందుకు ఆన్‌లైన్ టీచింగ్‌ను తగ్గించాలని ఆర్థిక సర్వే చెప్పింది.

* అనారోగ్యకర ఆహారం, స్థూలకాయం దేశ ఆర్థిక ప్రమాదమని ఆర్థిక సర్వేలో తెలిపింది. మహిళల్లో 24 శాతం, పురుషుల్లో 23 శాతం స్థూలకాయం ఉంది. పిల్లల్లో కూడా సమస్య పెరుగుతోంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగం వేగంగా పెరుగుతోందని సర్వే హెచ్చరించింది.

* గిగ్ కార్మికుల ఆదాయంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సర్వే ప్రకారం, దేశంలో 40 శాతం గిగ్ కార్మికులు నెలకు రూ.15 వేలలోపు ఆదాయం పొందుతున్నారు. పనికి కనీస వేతనం నిర్ణయించాలని సర్వే సూచించింది. ఆదాయ అస్థిరత్వం, రుణాల కొరత, అల్గోరిథమ్ నియంత్రణలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వే హెచ్చరించింది. నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత అవసరమని తెలిపింది.

* భారత స్వదేశీ విధానాన్ని క్రమశిక్షణతో అమలు చేయాలి. దిగుమతుల తగ్గింపుకంటే ఎగుమతి సామర్థ్యమే ప్రమాణమని తెలిపింది. తూర్పు ఆసియా, వియత్నాం అనుభవాలను ప్రస్తావిస్తూ ఖర్చుల తగ్గింపు, నియంత్రణల సరళీకరణ అవసరమని చెప్పింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ సర్వేలో, రాజకీయ మద్దతు, పనితీరు ఆధారిత విధానాలు అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.