
ఢిల్లీ: భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్నిప్రతిబింబించిందని..ఇది చరిత్రలో అరుదైన గౌరవం అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. పార్లమెంటు సభ్యులకు మార్గనిదేశం చేస్తూ కొన్ని విషయాలు చెప్పారని అన్నారు. బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవని, ఈ సందర్భంగా దేశ ప్రజలు, యువత ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఢిల్లీలో ఆయన ప్రసంగించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారని, 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నామని తెలియజేశారు. రిఫార్మ్, పెర్ఫామ్, ట్రాన్స్ ఫార్మ్ విధానంతో ముందుకెళ్లాలని, భారత్-ఇయూ వాణిజ్య ఒప్పందం భారత భవిష్యత్ కు కీలకం కానుందని మోడీ జోష్యం చెప్పారు. ప్రపంచానికి భారత్ ఆశా కిరణంగా మారిందని, భారత్-ఇయూ ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా మారిందని అన్నారు. మన వస్తువులకు డిమాండ్ పెరగబోతుందని, తయారీ, సర్వీస్ సెక్టార్ లో మన భాగస్వామ్యం పెరుగుతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.