
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు పోటీచేస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డితో కలిసి కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, జిహెచ్‌ఎంసి ఎన్నికలలో కలిసి పని చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కవితతో జావెద్ లతీఫ్ చర్చలు జరిపారు.