Reading Time: 2 minutes

బారామతి ఎయిర్‌పోర్ట్ సమీపంలో నేల కూలిన విమానం

ఉప ముఖ్యమంత్రి పవార్, మరో నలుగురు మృతి

మృతుల్లో పైలట్ కెప్టెన్ సుమిత్‌కుమార్, ఫస్ట్ లేడీ ఆఫీసర్ శాంభవీ పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ, పవార్ వ్యక్తిగత

సహాయకుడు విదిప్ జాదవ్ 

బారామతి : మహారాష్ట్రలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన న్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరాఠా సీనియర్ నేత అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందారు. ప్రమాదానికి కారణాలు ఏమిటనేవి వెనువెంటనే తెలియలేదు. అయితే అత్యవసర లాండింగ్ పరిస్థితుల్లో తలెత్తిన విషమ పరిస్థితితోనే ఈ ఛార్టెడ్ ఫ్లెయిట్ రెండు ముక్కలై పోలిపోయిందని ప్రాధమికంగా తేలింది. బుధవారం ఉదయం పుణే జిల్లాలోని పవార్‌ల బలీయ ప్రాంతమైన బారామతిలోని విమానాశ్రయం వద్దనే ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలో దాదాగా పిలవబడే 66 సంవత్సరాల అజిత్ పవార్ ఎన్‌సిపి చీలిక వర్గం అధినేతగా ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 5వ తేదీన జరిగే జడ్‌పి ఎన్నికల్లో ప్రచారానికి ముంబై నుంచి బయలుదేరారు.

ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన విఎస్‌ఆర్ వెంచర్స్ నిర్వహిస్తోంది. ముంబై నుంచి ఉదయం 8.10 గంటలకు బయలుదేరిన తరువాత ఈ లియర్‌జెట్ 45 ఛార్టెడ్ విమానం దాదాపు 8.45 ప్రాంతంలో రాడార్ వ్యవస్థలో కన్పించకుండా పోయింది. సరిగ్గా ఐదు నిమిషాల్లో అంటే 8.50 నిమిషాలకు విమాన పతనం జరిగింది. పవార్‌తో పాటు ఈ ప్రమాదంలో మరణానికి గురైన వారిలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఓ అటెండెంట్ ఇద్దరు విమాన సిబ్బంది పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ సుమిత్ కుమార్, ఫస్ట్ లేడి ఆఫీసరు కెప్టెన్ శాంభవి పాఠక్ ఉన్నారని విమానయాన వ్యవహారాల డిజిసిఎ అధికారి ప్రకటన వెలువరించారు. ప్రమాదం తరువాత విమానంలో మంటలు చెలరేగాయని జిల్లా ఎస్‌పి సందీప్ సింగ్ గిల్ తెలిపారు. పూర్తిగా గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉన్న స్థితిలో మృతదేహాలను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అత్యంత సీనియర్ నేత అయిన శరద్ పవార్ అజిత్ పవార్‌కు బాబాయి అవుతారు. అజిత్ పవార్‌కు భార్య సునేత్ర ఇద్దరు కుమారులు పార్ధ్ , జై ఉన్నారు. భార్య సునేత్ర రాజ్యసభ ఎంపి.

మంటల్లో దగ్ధమైన విమానం

బారామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో విమానంలోపల సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం కూలిపోయే ముందు విమానం కుదుపులకు గురైంది. తరువాత మంటలు చెలరేగాయి. ఈ దశలోనే నాలుగు అయిదు సార్లు పేలుళ్ల చప్పుళ్లు విన్పించాయి. అయితే ఈ విషయాలను అధికారులు నిర్థారించలేదు.

రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖుల సంతాపం

అజిత్ పవార్ ఇతరులు విమాన ప్రమాదంలో మృతిచెందిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రగతికి అజిత్ పవార్ సర్వదా పాటుపడ్డారని కొనియాడారు. ప్రత్యేకించి రాష్ట్రానికి అత్యవసరం అయిన సహకార రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమ స్పందనలో అజిత్ పవార్‌కు జన బాహుళ్యంతో ఉన్న బంధం విస్తృతం అన్నారు. అకాల మరణంతో రాజకీయాల్లో అగాథానికి దారితీసిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎన్‌డికు కుటుంబానికరే కాకుండా తనకు కూడా వ్యక్తిగతంగా బాధాకరం అని ప్రకటన వెలువరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ముంబైలో మాట్లాడుతూ ఈ విషాద వార్త తనకు నమ్మశక్యంగా కాకుండా ఉందన్నారు. తాను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయ్యానని చెప్పారు. ఆయన లేని లోటును పూడ్చడం కస్టమని తెలిపారు.

ఘటనా స్థలికి శరద్ పవార్ .. బోరున విలపించిన ఎంపి సుప్రియా

అజిత్ పవార్ దుర్మరణం గురించి తెలియగానే సీనియర్ నేత శరద్ పవార్ కొద్ది మంది నేతలతో కలిసి బారామతి ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వెంటనే అజిత్ పవార్ భౌతిక కాయం ఉంచిన స్థానిక మెడికల్ కాలేజ్ వద్దకు కూడా వెళ్లారు. బారామతి ఎంపి సుప్రియా సూలే ఈ ఘటనతో షాక్ అయ్యారు.