
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగం గా సోమవారం 117 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్లకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుద ల చేసింది. మొత్తం 51,92, 220 మంది ఓటర్లు ఉండగా, వారిలో 25, 37,136 మంది పురుషులు, 26, 54,453 మంది మహిళా ఓటర్లు, 631 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇటీవల 117 మున్సిపాలిటీలు, 6 కార్పోరేషన్ల(నిజామాబాద్, మ హబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం)లో ఓటర్ జాబితా ముసాయిదా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్‌ఇసి తు ది ఓటరు జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.