Reading Time: < 1 minute

నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా యుపి వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుంకుంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన ఆర్‌సిబి అదే జోరుతో ఈ మ్యాచ్ బరిలో దిగుతోంది. కాగా, గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో పోరాడి ఓడిన యుపి వారియర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో ఖాతా తెరవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టులో ఒక మార్పు చేసింది. ప్రేమ స్థానంలో గౌతమీ జట్టులోకి వచ్చింది. యుపి వారియర్స్ గత మ్యాచ్‌లోని జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తోంది.

తుది జట్లు :

యుపి వారియర్స్: కిరణ్ నవ్‌గిరే, మెగ్ లానింగ్(కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్(కీపర్), డియాండ్రా డాటిన్, సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోభన, శిఖా పాండే, క్రాంతి గౌడ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), దయాళన్ హేమలత, గౌతమి నాయక్, రిచా ఘోష్(కీపర్), రాధా యాదవ్, నదీన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.