Reading Time: < 1 minute

బెంగళూరు: ఆరు నెలల బాలికను పక్కింటి వ్యక్తి కిడ్నాప్ చేశారు. బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేసి మురికి కాలువలో పడేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. నల్లురహళ్లి ప్రాంతంలో యుషఫ్ ఖాన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పక్కింట్లో ఉండే మహిళతో యుషఫ్ ఖాన్ పలుమార్లు గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొని మహిళ కుటుంబంపై యుషఫ్ పగ పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దేవాలయం పక్క ఉన్న మురికి కాలువలో పడేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శవ పరీక్షలో బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలింది. పక్కింటి వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కటక్ రైల్వే స్టేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.