Reading Time: < 1 minute

 హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. బోరబండ సమీపంలో యువతిని ప్రేమోన్మాది దారుణంగా హతమార్చాడు. గతంలో బంజారాహిల్స్ సమీపంలో ఉన్న ఒక పబ్‌లో ఊర్వశి అనే యువతి, యవకుడి పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. ఇటీవల ఊర్వశి అనే యువతి బార్‌కు షిఫ్ట్ అయింది. గత కొంత కాలంగా యువకుడిని యువతి పట్టించుకోకపోవడంతో ఆమెపై అతడు ఆగ్రహంగా ఉన్నాడు. యువతిని మాట్లాడుతామని యువకుడు పిలిచి కత్తితో ఆమెను పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.