Reading Time: < 1 minute

ఏర్పాటు చేసిన గంటల్లోనే.. చెత్తకుప్పలా పబ్లిక్ చార్జింగ్ పాయింట్‌‌!..మనాలిలో పర్యాటకుల నిర్వాకం

Caption of Image.
  • సోషల్​ మీడియాలో ఫొటోలు​  వైరల్​

మనాలి: హిమాచల్ ప్రభుత్వం మనాలి పట్టణంలో ఇటీవల పర్యాటకుల సౌకర్యార్థం ఒక పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్‌‌ ఏర్పాటు చేసింది. పర్యాటకుల  ఫోన్లు, గాడ్జెట్లు చార్జింగ్ అయిపోయి ఇబ్బంది పడొద్దని సర్కారు భావించింది. అయితే చార్జింగ్​ స్టేషన్​ ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే దాన్ని చెత్త చేశారు. ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన జాగల తినేసి పడేసిన పేపర్లు, ప్లాస్టిక్ కప్పులు, చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోయింది.

 ‘‘సర్కారు ఎన్ని పనులు చేసినా, స్వచ్ఛ భారత్ అని గొంతు చించుకున్నా.. మనుషుల బుద్ధి మారనంత కాలం ఏం చేసినా అడవి కాచిన వెన్నెలే అవుతది” అని నెటిజన్లు తిట్టిపోస్తున్నరు.  నిఖిల్ సైని అనే యూజర్​ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ చార్జింగ్​స్టేషన్​ ఫొటోలు  వైరల్​గా మారాయి.

©️ VIL Media Pvt Ltd.