
లుక్ విషయంలో సీనియర్ హీరోలు సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారా..? బయట బాగానే కనిపిస్తున్నా.. సినిమా లుక్ మాత్రం సీక్రెట్‌గా ఉంచుతున్నారా..? సగం షూటింగ్ అయిపోతున్నా కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా అభిమానులతో ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నారు..? ఈ ఆగస్టులోనే సస్పెన్స్‌కు తెరపడబోతుందా..? అసలెవరా సీనియర్ హీరోలు..? టాలీవుడ్‌లో సీనియర్ హీరోలంతా ఈ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారిప్పుడు. బయట ఈవెంట్స్‌లో బాగానే కనిపిస్తున్నా.. సినిమా సెట్స్‌లో ఏముందో ఎవరికీ తెలియనివ్వకుండా భలే జాగ్రత్త పడుతున్నారు. ఎంత ట్రై చేసినా వాళ్ల సినిమా లుక్స్ అయితే లీక్ అవ్వట్లేదు. ఇటు నాగార్జున.. అటు చిరంజీవి ఇద్దరూ ఇదే చేస్తున్నారు. నాగార్జున హీరోగా రా కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వందో సినిమా షూటింగ్ దాదాపు చివరికి వచ్చినా లుక్ మాత్రం రాలేదు. నాగ్ బయట ఫంక్షన్లలో బానే సందడి చేస్తున్నా సినిమాలో ఆయన ఎలా కనిపించబోతున్నారో మాత్రం చిన్నపాటి హింట్ కూడా ఇవ్వట్లేదు. అయితే ఆగస్ట్ 29న కింగ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక 100వ సినిమా ఫస్ట్ లుక్‌తో భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగా 158 కోసం లుక్ విషయంలో చిరంజీవి మామూలు సస్పెన్స్ మెయింటైన్ చేయట్లేదు. ఇద్దరు మాస్టర్ల పంచాయితీ సెటిల్ చేయడానికి బయటికి వచ్చినా.. లుక్ మాత్రం రివీల్ కాలేదు. ఆగస్ట్ 22న బర్త్ డే రోజు టీజర్‌తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేయనున్నారు.. దీనికి కాకా అనే ఊరమాస్ టైటిల్ పరిశీలిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు!
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు
Gold Prices: పసిడి ప్రియులకు షాక్.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?