Reading Time: < 1 minute

ఎయిర్‌టెల్ బిజినెస్, ఐటీఐ లిమిటెడ్‌తో ఒప్పందం.. సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించనున్నట్లు ప్రకటన

Caption of Image.

భారతీ ఎయిర్‌టెల్  బి2బి విభాగం అయిన ఎయిర్‌టెల్ బిజినెస్, టెలికాం పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఐటీఐ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.  సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించేందుకు ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు 2026 ఆగస్టు 10న ప్రకటనలో తెలిపాయి.

ఈ సహకారం ద్వారా ఎయిర్‌టెల్ బిజినెస్ పబ్లిక్ సెక్టార్ (డిఫెన్స్ రంగం సహా)లో తన వాటాను పెంచుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐటిఐ లిమిటెడ్ కోటాను వినియోగించుకుని ఇది సాధ్యమవుతుంది.

 ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ (ఓఎఫ్‌సి, జీపీఓఎన్, ఎస్‌డి-వాన్, ప్రైవేట్ 4జి/5జి), సురక్షిత డేటా సెంటర్, సావరిన్ క్లౌడ్ సేవలు, ఇండస్ట్రియల్ ఐఒటి, ఏఐ-ఆధారిత అనలిటిక్స్, పూర్తి స్థాయి సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వంటివి కలిపి అందించనున్నారు. బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లు వంటి రెగ్యులేటెడ్ రంగాలపై కూడా దృష్టి సారించనున్నారు.

►ALSO READ | ఉచిత UPI పేమెంట్స్ కాలం చెల్లిందా.. రూ.2వేలకు పైన ఛార్జీల మోత తప్పదా..? అసలు విషయం ఇదే!

ITI లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ రాయ్ మాట్లాడుతూ,  డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, వేగవంతమైన కనెక్టివిటీ, హైపర్ స్కేల్ డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, ఐఒటి వంటి అవసరాలను తీర్చేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. 

ఎయిర్‌టెల్ బిజినెస్ సీఈఓ శరత్ సిన్హా  మాట్లాడుతూ.. భారత్ డిజిటల్ గ్రోత్ దశలో సావరిన్, రెగ్యులేటరీ కంప్లయింట్ బేస్ అవసరం అని చెప్పారు. ఐటీఐతో ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్‌కు సిద్ధమైన టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తామని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.