Reading Time: < 1 minute
Viral Video: నా వెనక మా అమ్మ ఉంది.. దగ్గరికొస్తే మీ పని అయిపోతది.. బుల్లి ఏనుగు ఏం చేసిందో చూడండి..

ఏనుగు పిల్లలు చేసే చిన్న చిన్న పనులు, వాటి అమాయకపు చేష్టలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాటి అల్లరిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. మరియాన్ అనే ఏనుగు పిల్ల చేసిన ముద్దులొలికే పని చూస్తే ఎవరైనా సరే మురిసిపోవాల్సిందే. జోడి ఫోర్డ్ అనే నెటిజన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మనోహరమైన వీడియోను పంచుకున్నారు. అడవిలో సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న పర్యాటకులకు రోడ్డుపై ఈ చిన్న ఏనుగు పిల్ల ఎదురైంది. తన వెనుక తల్లి ఏనుగు ఉందన్న ధైర్యంతో, ఆ చిన్నారి ఏనుగు పర్యాటకులను భయపెట్టాలని చూసింది. తన రెండు చెవులను పెద్దవిగా చేసి, తలను ఊపుతూ, వేగంగా జీప్ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద గజరాజులాగా గంభీరంగా హంగామా చేయడానికి ప్రయత్నించింది. అయితే దాన్ని చూసి పర్యాటకులు భయపడటానికి బదులు.. ఆ చిన్నారి అమాయకత్వానికి మురిసిపోయారు. పర్యాటకులందరూ నవ్వుతూ ఆ దృశ్యాలను తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు.

1.7 కోట్ల వీక్షణలు.. నెటిజన్లు ఫిదా

సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియో నెట్టింట సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ క్లిప్పింగ్‌కు 17 మిలియన్లకు పైగా వ్యూస్ రావడమే కాకుండా, లక్షలాది లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వెనుక అమ్మ ఉందనే కదా ఈ చిన్నారికి అంత ధైర్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘అది భయపెట్టడానికి చేసిన దాడి 99 శాతం అయితే.. దాని వల్ల జరిగిన నష్టం మాత్రం 1 శాతం కూడా లేదు అంత ముద్దుగా ఉంది’’ అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ప్రకృతిలో ఇలాంటి అమాయకపు దృశ్యాలు చూడటం కళ్లకు ఎంతో బాగుంటుంది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మామూలుగా అడవిలో గజరాజులు ఎదురైతే పర్యాటకులు భయంతో వణికిపోతారు. కానీ ఈ చిన్నారి ఏనుగు చేసిన క్యూట్ అల్లరి మాత్రం అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది.

వీడియో చూడండి..

 

View this post on Instagram

 

A post shared by • Jodi Ford • (@jodi_ford67)