Reading Time: < 1 minute
Ranabaali Release Date October 30 Vijay Deverakonda Rashmika Mandanna New Update

Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో రణబాలిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. బ్రిటిష్ పాలన కాలం నాటి స్టోరీతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రష్మిక రికవరీ కూడా సంతృప్తికరంగా కొనసాగుతుండటంతో.. సినిమా పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ సినిమా 2026 సెప్టెంబర్‌ 11న విడుదల చేయాలని మేకర్స్‌ తొలుత ప్లాన్ చేశారు. అయితే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో జాప్యం కారణంగా సెప్టెంబర్‌ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్మిక రికవరీ సజావుగా సాగుతుండటంతో మిగిలిన పనులను పూర్తి చేసి అక్టోబర్‌ 30 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్రబృందం గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్‌ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర కోసం ప్రత్యేకంగా శారీరక శిక్షణ తీసుకోవడంతో పాటు కత్తిసాము వంటి విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఇక రష్మిక ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌ మరోసారి తెరపై ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ది మమ్మీ’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై మరింత హైప్‌ పెంచింది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.