Reading Time: 2 minutes

జ్యోతిష్య నిపుణుల ప్రకారం 2026 లో ఏర్పడే రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12 రాత్రి ప్రారంభమై ఆగస్టు 13 ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ద్వాదశ రాశుల వారిపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. జాతకంలోని అశుభ ప్రభావాలను తగ్గించుకుని శుభ ఫలితాలు పొందడానికి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో, ఏ వస్తువులు దానం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మేష, వృషభ రాశుల పరిహారాలు: మేషరాశి వారు గ్రహణం తర్వాత హనుమాన్ చాలీసా చదువుకుని పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఇక దీనివల్ల సమస్యలు తీరి కొత్త అవకాశాలు వస్తాయి. వృషభరాశి వారు ఆగస్టు 13 ఉదయాన్నే శివుడికి తెల్లని పూలతో అభిషేకం చేసి పాలు, పెరుగు దానం చేయడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

మిథున, కర్కాటక రాశుల పరిహారాలు: మిథునరాశి వారు గోమాతకు పచ్చిగడ్డి, పిల్లలకు పుస్తకాలు దానం చేస్తే కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. ఇక కర్కాటకరాశి వారు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి తెల్లని వస్త్రాలు, బియ్యం దానం చేయడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుపడుతుంది.

సింహ, కన్య రాశుల పరిహారాలు: సింహరాశి వారు ఆవునెయ్యితో దీపారాధన చేసి, గోధుమలు, బెల్లం దానం చేయడం వల్ల దోషాలు తొలగి గొడవలు తగ్గుతాయి. ఇక కన్యారాశి వారు హనుమంతునికి వడమాల సమర్పించి ఆవుకు పచ్చిమేత, పెసరపప్పు ఇవ్వడం ద్వారా జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు నయమవుతాయి.

August 12 Solar Eclipse: How Will It Affect Your Zodiac Sign?
August 12 Solar Eclipse: How Will It Affect Your Zodiac Sign?

తులా, వృశ్చిక రాశుల పరిహారాలు: తులారాశి వారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, పాలతో అభిషేకం చేయడం వల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక వృశ్చికరాశి వారు శివుడికి తేనె సమర్పించి పప్పు, బెల్లం దానం చేయడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు.

ధనుస్సు, మకర రాశుల పరిహారాలు: ధనుస్సురాశి వారు అనాథలకు స్వీట్లు, పసుపు రంగు బట్టలు, బియ్యం దానం చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఇక మకరరాశి వారు ఇష్టదైవాన్ని ధ్యానించి నల్లని దుస్తులు, గొడుగు దానం చేయడం వల్ల సకల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కుంభ, మీన రాశుల పరిహారాలు: కుంభరాశి వారు శనిభగవానుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె సమర్పించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి కెరీర్ బాగుంటుంది. ఇక మీనరాశి వారు ఎర్రటి స్వీట్లు, పసుపు బట్టలు దానం చేయడం ద్వారా ఆఫీసులో ఒత్తిడి తగ్గి పనుల్లో విజయం లభిస్తుంది.

గ్రహణ ప్రభావం వల్ల కలిగే ప్రతికూలతలను దాటుకుని, మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి.

గమనిక: భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి సూతక కాల నియమాలు వర్తించవు. మీ రాశి తత్వానికి తగిన పూర్తి వివరాల కోసం స్థానిక జ్యోతిష్య పండితులను సంప్రదించడం శ్రేయస్కరం.

The post ఆగస్టు 12 సూర్యగ్రహణం.. మీ రాశిపై ప్రభావం ఎలా ఉండబోతోంది? appeared first on Manalokam – Latest Telugu News & Updates.