Reading Time: 2 minutes

ప్రధాన మంత్రి ఎమర్జెన్సీ ఫండ్ నుంచే మాకు నిధులు: కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టేసిన కాక్రోచ్ పార్టీ ప్రకటన

Caption of Image.

దేశంలో మరో డిబేట్ కు ఆజ్యం పోసింది కాక్రోచ్ జనతా పార్టీ. సీజేపీ కార్యకలాపాలకు నిధుల విషయంలో ఆ పార్టీ ప్రతినిధులు చేసిన ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసినట్లయింది.  తమ పార్టీకి నిధులు ప్రధాన మంత్రి ఎమర్జెన్సీ ఫండ్స్ నుంచే వస్తున్నాయని కొత్త చర్చను ముందుకు తెచ్చారు.

కాక్రోచ్ జనతా పార్టీకి ఫండ్స్ ఎలా వస్తున్నాయో విచారణ చేయాల్సిందిగా RTI యాక్టివిస్టులు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇంతకు  ముందే ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే కౌంటర్ ఇచ్చారు. పీఎం కేర్స్ ఫండ్ నుంచే కాక్రోచ్ పార్టీకి ఫండింగ్ వస్తున్నట్లు సెటైరికల్ గా సమాధానం చెప్పారు. 

మరోసారి అలాంటి సమాధానమే ఆ పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా చెప్పాడం చర్చకు దారితీస్తోంది. ఫండ్స్ విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేసేలా.. వ్యంగ్యంగా ఈ సమాధానం చెప్తున్నారు సీజేపీ ప్రతినిధులు. ఫండింగ్ విషయంలో వస్తున్న ప్రశ్నలకు జవాబిస్తూ.. త మకు డైరెక్టుగా పీఎం కేర్స్ ఫండ్ (PM CARES FUND) నుంచే నిధులు వస్తున్నాయని.. ఆ ఫండ్ విషయంలో దేశ వ్యాప్తంగా ఉన్న అనుమానాలను పరోక్షంగా ప్రస్తావించారు.  

పీఎం కేర్స్ ఫండ్ పై ఏంటి వివాదం:

పీఎం కేర్స్ ఫండ్ అంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్  అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచువేషన్స్ అని అర్థం. అంటే అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సహాయం, ఉపశమనం కల్పించే ప్రధాన మంత్రి నిధి అని అర్థం. దీన్ని కోవిడ్-19 పాండమిక్ సందర్భంగా 2020 మార్చిలో ప్రారంభించారు. 

ఈ ఫండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) 2005 కిందికి రాదని ప్రధానమంత్రి ఆఫీసు నుంచి జూన్ 2020లో ప్రకటన వచ్చింది. అప్పట్లో ఈ ఫండ్ ట్రాన్స్పరెన్సీ విషయంలో ఆర్టీఐ వేయగా.. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. 

దేశంలో ఎలాంటి ఫండింగ్ అయినా, ఏజెన్సీలు అయినా చట్టం కిందికి వస్తాయి. అందులో భాగంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రజలు తెలుసుకునే హక్కు ఉంటుంది. ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది.. ఎవరెవరు ఇస్తున్నారు.. ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఇలా ప్రతీది తెలుసుకునే వెసులుబాటు ఈ చట్టం ప్రకారం ఉంటుంది. కానీ ఈ ఫండ్ ఆర్టీఐ చట్టం కిందికి రాదని.. దీనిపై ప్రశ్నలు, అనుమానాలకు తావులేదని తేల్చిచెప్పింది.

ALSO READ : సభకు రావడానికి అమిత్ షాకు ఎందుకంత భయం.?

దేశ పౌరులు స్వచ్ఛందంగా ఇస్తున్న ఫండ్ పై ఆడిట్ లేకపోతే ఎలా..? అనేది సీజేపీ ప్రశ్న. దేశ వ్యాప్తంగా ఉన్న ఫండింగ్ లపై ఆడిట్ ఉంటుంది.. మరి పీఎం కేర్స్ ఫండ్ పై ఎందుకు ఉండకూడదని వారు ఇండైరెక్టుగా ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇందులో భాగంగానే తమకు పీఎం కేర్స్ నుంచే నేరుగా ఫండింగ్ వస్తుందని సెటైరికల్ గా సమాధానం చెప్పారు.

సీజేపీ కార్యకలాపాలపై, ఫండింగ్ పై ఆరాటపడుతున్న యాక్టివిస్టులు.. దాదాపు ఆరేళ్లకుపైగా ఆడిట్ లేకుండా.. ఎక్కడ ఖర్చు చేస్తున్నారో.. ఎందుకు ఖర్చుచేస్తున్నారో కూడా వివరాలు బయటకు రాకుండా నడుస్తున్న పీఎం కేర్స్ ఫండ్ పై ఎందుకు ఆర్టీఐ వేయలేకపోతున్నారని ఇప్పటికే సీజేపీ ఫౌండర్ ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.