Reading Time: 2 minutes

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన విద్యార్థులు.. జార్ఖండ్ అసెంబ్లీ వాయిదా.. పరిస్థితి ఉద్రిక్తం!

Caption of Image.

జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళనలు.. జంతర్ మంతర్ లో కాక్రోచ్ పార్టీ చేపట్టిన నిరసనలను తలపిస్తున్నాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకతవకతలపై నిరసన బాట పట్టిన విద్యా్ర్థిలోకం.. 2026 ఆగస్టు 10న చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.  టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగంతో రణరంగంగా మారింది. పోలీసుల బారికేడ్లను దాటుకుంటూ విద్యార్థి ఆందోళన కారులు అసెంబ్లీ ఆవరణ లోకి దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీని వాయిదా వేశారు.

ఇటీవల జరిగిన JPSC,  CGL పరీక్షలను రద్దు చేసి స్వంతంత్ర్య దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. జాతీయజెండా, ప్లకార్డులతో కదం తొక్కిన విద్యార్థులు.. పోలీసు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లకు వెనుదిరగకుండా ముందుకు సాగడంతో పరిస్థితి రచ్చరచ్చగా మారింది. బ్యారికేడ్లను తొలగిస్తూ ముందకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

అటు అసెంబ్లీ సమావేశాలు.. ఇటు సీఎం హేమంత్ సోరేన్ జన్మదినం ఉండగా అసెంబ్లీ ముట్టడి జరగటం గమనార్హం. అసెంబ్లీ ముట్టడి మార్చ్ ఉదయం 10.30 గంటలకు పాత అసెంబ్లీ ముందును నుంచి ప్రారంభమైకొత్త అసెంబ్లీ కాంప్లెక్స్ వైపు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. చివరి బ్యారికేడ్ ఉన్న జగన్నాథ్ పూర్ టెంపుల్ వద్దకు మార్చ్ చేరుకోవడంతో పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. దీనికి భయపడకుండా నీళ్ల ప్రెజర్ కు ఎదురేగి డ్యాన్సింగ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి నుంచి కూడా అసెంబ్లీ వైపుకు దూసుకుపోతుండటం ఆందోళన కలిగించే అంశం. 

►ALSO READ | ప్రధాన మంత్రి ఎమర్జెన్సీ ఫండ్ నుంచే మాకు నిధులు: కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టేసిన కాక్రోచ్ పార్టీ ప్రకటన

విద్యార్థులు ఎంత మేరకు తగ్గకపోవడంతో.. లాఠీఛార్జీ చేసిన పోలీసులు.. కొన్ని రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. అసెంబ్లీకి 200 మీటర్ల దూరంలో ఉన్న సందర్భంలో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. పోలీసులు తమపై లాఠీ ఛార్జీ చేసినట్లు ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. 

ఆమరణ నిరాహార దీక్షకు దిగి చికిత్స పొందుతున్న విద్యా్ర్థి నాయకుడు దేవేంద్ర మహతో అంబులెన్సులోనే మార్చులో పాల్గొన్నారు. మాజీ సీఎం శిబు సోరేన్ చిత్రపటాన్ని చేతులో ఉంచుకుని అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనటం విశేషం. నిరసనకారుల డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. 

అయితే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి ఆరోపణలతో మాజీ ఛైర్మన్ ఎల్ ఖయింగ్టేను సీఐడీ అరెస్టు చేసింది. అవకతవకలకు సంబంధం ఉందన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.