
మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాలవర్షం కురిసింది. పిడుగు పడి ధాన్యం కొనుగోలు సెంటర్ లో పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలం సుధానపల్లిలో ఆదివారం (మే 3) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటివరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న నీలం వెంకన్న(40) అనే వ్యక్తిపై పిడుగుపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో సుధానపల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి.