Reading Time: < 1 minute

జ్యువెలరీ షాపు దొంగలను పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కరీంనగర్ పోలీసుల ప్రకటన

Caption of Image.

కరీంనగర్ లో PMJ జ్యువెలరీ షాపు దోపిడీ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్ లోని కమాండ్ కంట్రోల్, నగరంలోని  సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.మరోవైపు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని  కోరారు.ఫెక్సీలు, సోషల్ మీడియాద్వారా దొంగల ఫొటోలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. భారీ దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు.

కరీంనగర్ జువెలరీ షాప్ చోరి నిందితుల ఆచూకీ చెబితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు కరీంనగర్ పోలీసులు. నిందితుల ఫొటోలతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫొటోలతో  కనిపిస్తున్న  వ్యక్తులు  కరీంనగర్ లోని బంగారం షాపులో దొంగతనం చేశారు.. వారి గురించి ఏమైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, లక్షరూపాయలు బహుమతి ఇస్తామని కరీంనగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, ఏసీపీల పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. 

ఆదివారం (మే3) పట్టపగలు కరీంనగర్ లోని నడిబొడ్డున ఉన్న PMJ జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ చేసిన విషయం తెలిసిందే. తుపాకులతో జ్యువెలరీలో చొరబడ్డ ఐదుగురు దోపిడి దొంగలు.. కస్టమర్లు, షాపు సిబ్బందిని బెదిరించి దాదాపు కిలో బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో ఈఘటన జరిగింది. బండి సంజయ్ ఆ ప్రాంతంలో అభివృద్ది పనులకు శంకుస్తాపన చేశారు. అప్పటివరకు  ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఉంది.. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో  పట్టపగలు భారీ దోపిడీ జరగడం చర్చనీయాంశంగా  మారింది. 

©️ VIL Media Pvt Ltd.