Reading Time: < 1 minute

సమ్మర్ లో ఏది బెస్ట్? కొబ్బరి నీళ్లా? లేక చెరకు రసమా? వాస్తవాలు ఇవే!

Caption of Image.

రోజురోజుకు ఎండల దంచి కొడుతున్నాయి. టెంపరేచర్ పెరుగుతున్నపుడు అటోమెటిక్ గా మన శరీరం సహజంగానే చల్లదనాన్ని కోరుకుంటుంది. దాహాన్ని తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరు చల్లటి డ్రింక్స్ తీసుకోవాలనుకుంటారు. అయితే సమ్మర్ సీజన్ లో  ముందుగా మనకు కనిపించే బెస్ట్ ఆప్షన్స్ చెరకు రసం,  కొబ్బరి నీళ్లు మరి ఈ రెండింటిలో ఏది బెస్టో తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడుకుంటే ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండలో లేదా వ్యాయామం చేసేటప్పుడు మనం కోల్పోయే ఖనిజాలను తిరిగి నింపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో చక్కెర శాతం చాలా తక్కువ. కేలరీల గురించి ఆందోళన చెందేవారికి, హైడ్రేషన్ కోసం ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

ఇక చాలా మందికి ఇష్టమైన స్వీట్ డ్రింక్ చెరకు రసం. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ, దీని ప్రధాన బలం చక్కెర అందించే తక్షణ శక్తి. ఎక్కువ సేపు ఎండలో నడిచిన తర్వాత లేదా బాగా అలసిపోయినప్పుడు, ఒక గ్లాసు చెరకు రసం తాగితే వెంటనే రీఛార్జ్ అయిన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి.

 ఈ రెండింటిలో ఏది బెటర్.?

  •  తక్కువ చక్కెర, ఎక్కువ ఎలక్ట్రోలైట్లు ఉన్న కొబ్బరి నీళ్లే బెటర్ . ఇది శరీరాన్ని ఎక్కువ సేపు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
  •  వెంటనే శక్తి కావాలనుకునే వారికి చెరకు రసం బెస్ట్. కానీ ఇందులో కేలరీలు ఎక్కువ కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు లేదా షుగర్ లెవల్స్ చూసుకునే వారు దీనిని మితంగా తీసుకోవడం మంచిది.
  • వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ రెండు డ్రింక్స్ బెటరే కానీ  కేవలం దాహం తీర్చుకుని  శరీరాన్ని చల్లబరుచుకోవాలి అనుకుంటే కొబ్బరి నీళ్లు ఉత్తమం. 
  • రుచికరమైన ఎనర్జీ బూస్ట్ కావాలనుకుంటే చెరకు రసాన్ని  తీసుకుంటే మంచిది. 
©️ VIL Media Pvt Ltd.