
కరీంనగర్ లో టౌన్ లో జరిగిన జ్యువెలరీ షాప్ కాల్పుల ఘటనలో ఐదుగురు దొంగలు బైకులపై పారిపోయారు. పల్సర్ బైక్ పై ముగ్గురు అపాచ్ బైక్ పై మరో ఇద్దరు పారిపోయారు. కరీంనగర్ రాజీవ్ రహాదారి మీదుగా పారిపోతున్న వీడియోలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీరిని పట్టుకోవడానికి పోలీసుల 12 బృందాలతో గాలిస్తున్నారు. నార్త్ గ్యాంగ్ గా అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొన్ని బుల్లెట్లు జ్యువెలరీ షాపులో స్వాధీనం చేసుకోగా..మరికొన్ని డ్రైనేజీలో స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల ఘటనతో జగిత్యాల జిల్లాలో పోలీస్ తనిఖీలు ముమ్మురం చేశారు. జగిత్యాల లోని పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీస్ డాగ్స్, బాంబు స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
కరీంనగర్ లోని PMJ జ్యుయలరీ షోరూంలో మే 3న ఉదయం దుండగులు బంగారం కొనుగోలు చేస్తామని షాపులోకి చొరబడ్డారు. నిందితుల్లో నలుగురు తుపాకులతో షాపులోకి ప్రవేశించి సిబ్బంది, కస్టమర్లపై కాల్పులు జరిపారు. కిలో బంగారం ఎత్తుకెళ్లారు.
కాల్పుల్లో షాపు సిబ్బంది గాయపడ్డారు.. వారు ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు సీపీ.కమాండ్ కంట్రోల్ రూం తోపాటు నగరంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం.. కరీంనగర్ లోని అన్ని హోటల్స్ లో తనిఖీలు చేపట్టామన్నారు సీపీ గౌస్ ఆలం.