Reading Time: 2 minutes

Health tips: వేసవిలో కుండనీళ్లు బెస్టా.. ఫ్రిజ్ వాటరా..! ఆరోగ్యానికి ఏది మంచిది?

Caption of Image.

వేసవిలో మండే ఎండలతో ఎక్కువ నీళ్లు తాగాలనిపిస్తుంది. ముఖ్యంగా చల్లని నీరు తాగాలనిపిస్తుంది. చల్లని నీళ్లు తాగితే శరీరాన్ని చల్లబర్చి ఎండ వేడిమి నుంచి ఉపశమనం, తక్షణమే తాజాదనాన్ని,డీహైడ్రేషన్  కాకుండా ఉంటుంది. వడదెబ్బ వంటి వేసవి ఆనారోగ్యాలనుంచి కాపాడుకోవచ్చు. అయితే చల్లని కోసం మట్టికుండలు,ఫ్రిజ్ లు వాడుతుంటాం.. చాలామందికి ఎండాకాలంలో  ఫ్రిజ్ నీళ్లు తాగితే మంచిదా..  కుండనీళ్లు తాగితే మంచిదా అనే  డౌట్ ఉంటుంది.. ఇంతకీ ఫ్రిజ్ నీళ్లు బెటరా.. కుండ నీళ్లు బెటరా? తెలుసుకుందాం.. 

మనకు చల్లని నీళ్లకోసం రెండు రకాల సోర్స్ ఉన్నాయి. ఒకటి మట్టికుండ, రెండోది రిఫ్రిజిరేటర్.. నీళ్లను చల్లగా ఉంచేందుకు పాతకాలంనుంచి మట్టి కుండలో నిల్వ చేస్తున్నారు. ఇప్పటికే అదే  కల్చర్ కొనసాగుతోంది.  అయి తే టెక్నాలజీ పెరిగిన తర్వాత చల్లనీ నీటికోసం రిఫ్రిజిరేటర్లు వచ్చాయి.  మట్టికుండలు నీటిని సహజ పద్దతిలో నీటిని చల్లబరుస్తాయి. రిఫ్రిజిరేటర్ లో టెక్నాలజీ ద్వారా నీటిని కూల్ చేస్తుంది. 

మట్కా నీరు vs రిఫ్రిజిరేటర్ నీరు..ఏది ఆరోగ్యకరమైనది?

రిఫ్రిజిరేటర్ నీటితో పోలిస్తే మట్కాలో చల్లబర్చిన నీరు ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్యనిపుణులు. రిఫ్రిజిరేటర్ నీరు తక్షణమే రిలీఫ్ కలిగించినప్పటికీ  దాని ద్వారా వచ్చే  చల్లదనం జీర్ణ లేదా శ్వాస కోశ వ్యాధులకు దారి తీస్తుందంటున్నారు. 

మట్టి కుండలో నీటి ప్రయోజనాలు.. 

మట్టి కుండలో భాష్పీభవన శీతలీకరణం ద్వారా నీళ్లను చల్లబరుస్తుంది. మట్టికుండలోని చిన్ని చిన్న రంధ్రాల ద్వారా నీరు ఇంకి నీటినుంచి వేడి బయటికి వెళ్తుంది. దీంతో సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. 

మట్కా నీటిలో పరిమితమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది మన గొంతుకు చాలా మంచింది. దగ్గు, గొంతు నొప్పి నివారించడంలో సాయపడుతుంది. రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే చల్లటినీరు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది కుండ నీళ్లను ఇష్టపడతారు. 

మట్కా నీరు మన జీవక్రియను పెంచుతుందంటున్నారు నిపుణులు. కుండ నీటిలో పోషకాలను నిలుపుకునే గుణం ఉంటుంది.. దీంతో జీవక్రియ మెరుగుపడుతుందంటున్నారు. శరీరాన్ని మరింత తేమగా ఉంచి చల్లదనాన్ని అందిస్తుంది. మట్టి కుండ నీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి సహజ ఖనిజాలను కూడా నిలుపుకుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

అయితే మట్కా (మట్టికుండ)ను శుభ్రంగా ఉంచుకోవడం మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం వారానికి ఒకసారి ఈ కుండను బ్రష్ ద్వారా శుభ్రం చేసుకోవాలి. బ్యాక్టీరియాను  తొలగించేందుకు ఎండలో ఆరబెట్టాలి. 

©️ VIL Media Pvt Ltd.