
ఇటీవల ముంబై ట్రాఫిక్ జామ్ విషయంలో మంత్రిని నిలదీసి వార్తల్లోకి ఎక్కిన టీనా చౌదరి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. మంత్రిని నిలదీసిన విషయంలో తన ధైర్యం సాహసాలను , చొరవను మెచ్చుకుంటూ నెటిజన్లు తనకు సపోర్టు్ గా ఉన్నందుకు కృతజ్ణతలు తెలిపారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన తను చాలా ఇబ్బంది పడినట్టు తెలిపారు. చివరికి విసుగొచ్చి ఆగ్రహంతో మంత్రిని నిలదీసినట్లు తెలిపారు. తాను ఎటువంటి న్యూసెన్స్ చేయలేదని అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ఎవరికి ఇబ్బంది లేకుండా బాటిల్ ను నేలపై విసిరి కొట్టానని తెలిపింది.
ట్రాఫిక్ జామ్ లో నేను మంత్రి నిర్లక్ష్యం పట్ల స్పందించిన తీరును నెటిజన్లు అభినందించారు. వారినుంచి నాకు చాలా మేసేజ్ లు వచ్చాయి. నా యోగక్షేమాలు అడిగారు వారందరికి ధన్యవాదాలు అంటూ టీనా చౌదరి సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో పోస్ట్ చేశారు.
#WATCH | Teena Choudhry, the woman seen in the viral video wearing a black cap, confronting Maharashtra Minister Girish Mahajan over a traffic jam, releases a statement detailing her side of the story
She says, “I have received so many messages regarding my safety. I want to let… pic.twitter.com/tcRLP3Gxqf
— ANI (@ANI) May 2, 2026
ఇంకా ట్రాఫిక్ జామ్ కు తనకు ఎదురైన ఇబ్బందిని వివరించారు టీనా.. ఏప్రిల్ 21న నా కూతురిని డ్యాన్ష క్లాస్ నుంచి తీసుకొచ్చేందుకు వెళుతుండగా.. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను.. దాదాపు అరగంటపాటు కారులోనే ఉన్నాను.. ట్రాఫిక్ కు అడ్డంగా రెండు బస్సులను తొలగించండి మేం పక్కనుంచి వెళతాం అని అటు ట్రాఫిక్ పోలీసులను, ఇటు మంత్రిని అడిగినా ఎవరూ స్పందించలేదన్నారు టీనా.. నా కూతురు పికప్ చేసుకునేందుకు ఏ దారి లేక ఆగ్రహంలో మంత్రితో వాగ్వాదానికి దిగాను.. ఆ సమయంలో అటెన్షన్ క్రియేట్ చేసేందుకు బాటిల్ ను నేలపైకొట్టానని తెలిపింది. అక్కడున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని టీనా వివరణ ఇచ్చారు. నిజానికి మంత్రి మహాజన్ మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ ర్యాలీలో కనీసం నేను చెప్పేది వినడానికి ప్రయత్నించిన వ్యక్తి అతను. అతని సూచనల మేరకు, ఆ రెండు బస్సులను పక్కకు జరిపారు, మేమందరం యూ-టర్న్ తీసుకుని ప్రధాన రహదారిలో కలవగలిగామన్నారు టీనా.
►ALSO READ | వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సంచలనం: ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశం