
మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకటా రెండా.. పదుల సంఖ్యలో సర్వే సంస్థలు.. తమ సర్వే వివరాలతో ఆ పార్టీ గెలుస్తుంది.. ఈ పార్టీ గెలుస్తుంది అంటూ రిజల్ట్స్ విడుదల చేస్తుంటారు. ఇప్పుడు అయితే వందల సంఖ్యలో న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి.. ఏ ఛానెల్ చూసినా అదే డిస్కషన్..
ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి.. ఏ ఛానెల్ ప్రసారం చేసింది..?
ఇండియాలో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవ్వటం 1996లో మొదలైంది. అప్పటి వరకు ఇలాంటి ట్రెండ్ లేదు. 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. ఇండియా ఫస్ట్ టైం ఎగ్జిట్ పోల్ సర్వే అని విడుదల అయ్యింది. CSDS అనే సంస్థ మొదలుపెట్టింది. ఈ సర్వే రిపోర్టును ప్రసారం చేసింది ఎవరో తెలుసా.. దూరదర్శన్. అవును.. మీరు విన్నది.. చదివింది నిజమే. 1996లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. దేశ వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తర్వాత.. CSDS సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వే అంటూ దూరదర్శన్ చర్చ పెట్టింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది అని ఆ సర్వే చెప్పింది. అప్పట్లో దూరదర్శన్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేకు దగ్గరగానే బీజేపీ పార్టీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.
ప్రపంచంలో ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ప్రారంభం అయ్యాయి..?
ఇండియా సంగతి సరే.. మరి ప్రపంచంలో ఫస్ట్ ఎలక్షన్ ఎగ్జిల్ పోల్స్ నిర్వహించింది అమెరికా దేశంలో. 1930 సంవత్సరంలో. అప్పట్లో ఈ ఎన్నికల సర్వేలు లోకల్ గా ఉండేవి. 1967 నాటికి ఇది అమెరికా జనరల్ ఎలక్షన్స్ కు సర్వేలు చేయటం వరకు వచ్చింది. వారెన్ మిటోఫ్స్కీ అనే అమెరికా శాస్త్రవేత్త.. కెంటకీలో జరిగిన గవర్నర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోలింగ్ నిర్వహించారు. అతని సర్వే ఫలితాల తర్వాత నిజం అయ్యింది. అదే ఏడాది నెదర్లాండ్స్ లో డచ్ సామాజిక వేత్త మార్సెల్ వాన్ డామ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే నిర్వహించాడు. వీళ్లను చూసిన మిగతా దేశాల్లోని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు వేగంగా అందిపుచ్చుకున్నాయి.
1982లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. ఓ మీడియా సంస్థ.. పోలింగ్ కు రెండు రోజుల ముందే ఎగ్జిట్ పోల్స్ అంటూ ప్రసారం చేసింది. దీనిపై వివాదం జరిగింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. ఆ పార్టీనే గెలుస్తుందని చెప్పటం ద్వారా.. పోలింగ్ ఆ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘానికి కంప్లయింట్స్ వెళ్లాయి. రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే.. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇవ్వాలని ఆ ఎన్నికల తర్వాత నిబంధనలు తీసుకొచ్చారు.
అమెరికాలో అప్పుడు తీసుకొచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిబంధనలనే.. ఇప్పుడు ఇండియాతోపాటు అనేక దేశాలు ఫాలో అవుతున్నాయి.
భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126A ప్రకారం.. పోలింగ్ ముందు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం నేరం. పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాల్సి ఉంటుంది.
సో.. మరికొన్ని గంటల్లో టీవీల్లో హోరెత్తనున్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కథకమామిష ఇదండీ..