Reading Time: 2 minutes
Hyderabad: ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మహిళా డ్రగ్ సప్లయర్‌ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఎల్బీనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్న సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువు లక్కన్‌తో కలిసి సునీత గంజాయి సిండికేట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లక్కన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500కు కొనుగోలు చేస్తున్న సునీత.. ఎల్బీనగర్‌కు చెందిన మరో సప్లయర్ సత్యకు అదే గంజాయిని కిలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్‌లో గంజాయి డ్రాప్ చేసేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ కేసులో సునీతతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లోకి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్‌ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

ఈగల్ టీమ్ విచారణలో గంజాయి సరఫరా చేసే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి.. హైదరాబాద్‌లోని డ్రగ్ సప్లయర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సునీత, లక్కన్‌లు డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా ఒడిస్సా నుండి ఆటోలో భద్రాచలం వరకు వచ్చి అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చేరుకుంటుంది..

అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరా కోసం నిందితులు ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్‌లో సత్యకు గంజాయి అందించేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో నిఘా పెట్టి పట్టుకుంది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 6 కిలోల గంజాయి విలువ వేలల్లో ఉంటుందని.. సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి గంజాయి హైదరాబాద్‌కు ఎలా చేరుతోంది.. ఈ ముఠాతో ఇంకా ఎవరెవరు సంబంధాలు కలిగి ఉన్నారు.. ఎక్కడెక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..