
2026 ఆగస్టులో అరుదైన సూర్యగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 90 నుంచి 93 శాతం సూర్యుడు కనపడకుండా పోయే ఈ గ్రహణం చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అరుదైన గ్రహణంగా చెప్పుకునే ఈ సూర్యగ్రహణం.. ఆగస్టు 12న ఏర్పడనుంది.
ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని ఇండియా నుంచి నేరుగా చూడలేం. ఇది స్విట్జర్లాండ్‌లో సంభవించనుంది. ఈ గ్రహణంలో ప్రదేశాన్ని బట్టి చంద్రుడు సూర్యుడిని సుమారు 90 నుంచి 93 శాతం వరకు కప్పివేస్తాడు. ఈ దృశ్యం సూర్యాస్తమయానికి దగ్గరగా జరుగుతుంది కాబట్టి, పశ్చిమ దేశాలలో చూడటానికి వీలవుతుంది.
ప్రపంచవ్యాప్త మార్గం ఎలా ఉంటుంది?
సంపూర్ణ సూర్యగ్రహణ మార్గం ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా ప్రారంభమై, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్‌ల మీదుగా వెళుతుంది. ఆ తర్వాత ఉత్తర స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల మీదుగా కదులుతుంది. పశ్చిమ ఐరోపా, వాయువ్య ఆఫ్రికా, ఈశాన్య ఉత్తర అమెరికాలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది.
స్విట్జర్లాండ్‌లో నగరాల వారీగా కవరేజ్
కేవలం స్విట్జర్లాండ్ నుంచి ఈ గ్రహణం చూసే వీలుండటంతో.. ఏ ఏ సిటీల్లో ఎంత మేరకు గ్రహణం ఏర్పడుతుందో డేటా ఈ కిందివిధంగా ఉంది.
జెనీవాలో సుమారు 92.7 శాతం ఏర్పడుతుంది. లౌసాన్లో 92.2 శాతం, బెర్న్: 91.4, బాసెల్ 90.8, జ్యూరిచ్: 90.6, సెయింట్ గాలెన్: 90.2 శాతంగా నమోదవుతుంది.
చూసేందుకు ఉత్తమ ప్రదేశాలు
వెస్ట్రన్ హారిజాన్ అంటే పడమటి దిగంతం దగ్గర స్పష్టంగా కనిపించే ఎత్తైన ప్రదేశాలు ఉత్తమం. దిగంతం అంటే దిక్కు అంతం అయ్యే ప్రదేశం. అంటే భూమి ఆకాశం కలిసిపోయినట్లు అనిపించే రేఖ.
►ALSO READ | ప్యూర్ పెట్రోల్ మీ అయ్యా ఇంట్లోంచి వస్తదా: E20 పెట్రోల్ విమర్శకులపై బీజేపీ MP వివాదస్పద వ్యాఖ్యలు
ప్రీ-ఆల్ప్స్, స్విస్ పీఠభూమిలోని కొన్ని భాగాలు చూసేందుకు మెరుగైన ప్రదేశాలు. సూర్యుడు దిగంతానికి కేవలం 3 డిగ్రీల ఎత్తులోనే ఉంటాడు. అందువల్ల పర్వతాలు, భవనాలు, చెట్లు అడ్డంకిగా మారవచ్చు. ముఖ్యంగా ఆల్పైన్ లోయల్లో జాగ్రత్తగా చూడాలి.
స్విట్జర్లాండ్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందా?
స్విట్జర్లాండ్ లో కూడా సంపూర్ణ గ్రహణం ఉండదు. చంద్రుడు సూర్యుని 90 శాతానికంటే ఎక్కువ భాగాన్ని కప్పడం వల్ల సన్నని నెలవంక ఆకారంలో సూర్యుడు కనిపిస్తాడు. సంపూర్ణ గ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర స్పెయిన్‌లలో మాత్రమే కనిపిస్తుంది.
కళ్లు జాగ్రత్త:
సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు తప్పనిసరిగా ISO -ధృవీకరించిన సూర్యగ్రహణ కళ్ళద్దాలు (సోలార్ ఎక్లి్ప్స్ గ్లాసెస్) లేదా సురక్షితమైన ఇండైరెక్ట్ పద్ధతులు ఉపయోగించాలి. సరైన కంటి రక్షణ లేకుండా సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కంటికి శాశ్వత నష్టం కలగవచ్చు.