Reading Time: 2 minutes
Yash Toxic Ramayana Dark Shades Character Analysis
‘కేజీఎఫ్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న యష్, రీ-ఎంట్రీతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఈ ఏడాది యష్ నుంచి రెండు భారీ సినిమాలు వస్తున్నాయి. రెండింట్లోనూ ఆయన క్యారెక్టర్స్ లో డార్క్ షేడ్స్, వైలెన్స్, పవర్, ఈగో కనిపిస్తున్నాయి— ఒకవైపు ‘టాక్సిక్’ లో రాయా, మరోవైపు ‘రామాయణ’ లో రావణ. ‘కేజీఎఫ్’ లో రాఖీ భాయ్ గా హీరోయిజమ్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిన యష్, ఇప్పుడు వరుసగా నెగిటివ్ క్యారెక్టర్స్ వైపు ఎందుకు వెళ్ళాడు? ఇది యష్ కెరీర్ లో కొత్త ప్రయోగమా, లేక రాఖీ భాయ్ ఇమేజ్ నుంచి బయట పడలేకపోతున్నాడా? అసలు యష్ రిస్క్ చేస్తున్నాడా, లేక తన బ్రాండ్ వాల్యూని తెలివిగా ఉపయోగించుకుంటున్నాడా? అనే చర్చ సాగుతోంది.  ‘కేజీఎఫ్’ లో రాఖీ భాయ్ క్యారెక్టర్ తో “హీరో అంటే ఎలా ఉండాలి” అనే కొత్త డెఫినిషన్ ఇచ్చాడు. గ్రే షేడ్స్ ఉన్నా, ఆడియన్స్ అతన్ని హీరోగానే చూశారు. పవర్, ఆటిట్యూడ్, వైలెన్స్, మాస్ ఎలివేషన్స్— ఇవన్నీ కలిసి రాఖీ భాయ్‌ను ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా మార్చాయి. కానీ ‘కేజీఎఫ్’ తర్వాత యష్ వెంటనే మరో సినిమా చేయలేదు, చాలా గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ ఎంచుకున్నాడు.
అయితే ఇక్కడే ఆశ్చర్యం! ‘కేజీఎఫ్’ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు అనుకుంటే, మరో డార్క్ వరల్డ్ లోకి వెళ్ళాడు. ‘టాక్సిక్’ లో ‘రాయా’ క్యారెక్టర్ లో కూడా గ్యాంగ్‌స్టర్ షేడ్స్, వైలెన్స్ కనిపిస్తున్నాయి. అంటే, రాఖీ భాయ్ బ్రాండ్ ను వదలకుండా దానికి మరో వెర్షన్ చూపించే ప్రయత్నమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. ‘టాక్సిక్’ లో యష్ క్యారెక్టరైజేషన్ చూస్తే గుడ్ వర్సెస్ బ్యాడ్ కథలా కనిపించడం లేదు. రాయా పాత్ర చుట్టూ వైలెన్స్, పవర్ గేమ్స్— వీటితో పాటు ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్ కి హీరోగా కనెక్ట్ అవుతూనే, “ఈ మనిషి నిజంగా హీరోనా, విలనా?” అనే డౌట్ కూడా కలిగించేలా క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ‘కేజీఎఫ్’ లో రాఖీ భాయ్‌ను చూసి ఆడియన్స్ విజిల్స్ కొట్టారు, ఇప్పుడు ‘టాక్సిక్’ లో మరింత నెగిటివ్ రోల్ కి షిఫ్ట్ అయ్యాడు. దాంతో యష్ అంటే రఫ్ లుక్, గన్, గ్యాంగ్‌స్టర్, వైలెన్స్ అన్న ఇమేజ్ కి ఆయన మరింతగా ఈ సినిమాతో బలం చేకూరుస్తున్నాడా అనిపిస్తుంది. యష్ తీసుకున్న మరో భారీ రిస్క్ ‘రామాయణ’ లో రావణుడి పాత్ర. ఇక్కడ యష్ హీరో కాదు, ఎపిక్ యాంటాగనిస్ట్. అయితే రావణుడిని కేవలం ఒక విలన్ గా కాకుండా పవర్, ప్రతీకారం, భక్తి లాంటి ఎన్నో లేయర్స్ ఉన్న క్యారెక్టర్ గా చూపించబోతున్నాడు. గోల్డెన్ ఆర్మర్, భారీ కిరీటం, రాయల్ ప్రెజెన్స్— స్క్రీన్ పై యష్ కనిపించే విధానం చూస్తే రావణ ఆరా స్పష్టంగా కనిపిస్తోంది.
యష్ ప్రస్తుతం ఒక స్టార్ నుంచి బ్రాండ్ గా మారే కీలక దశలో ఉన్నాడు. అందుకే ఆయన ఎంచుకునే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకవైపు ‘టాక్సిక్’ తో గ్యాంగ్‌స్టర్ వరల్డ్, మరోవైపు ‘రామాయణ’ తో మైథలాజికల్ ఎపిక్… రెండు సినిమాల జానర్లు వేరు, కానీ యష్ క్యారెక్టర్స్ లో మాత్రం డార్క్ నెస్, పవర్, నెగిటివ్ ఇంటెన్సిటీ కామన్ గా కనిపిస్తున్నాయి. ఇది కావాలనే చేస్తున్న స్ట్రాటజిక్ కెరీర్ ఛాయిస్ అయితే, యష్ తనకు బలమైన జోన్ లోనే సినిమాలు ఎంచుకుంటున్నాడని చెప్పొచ్చు. కానీ ఇదే పాటర్న్ కంటిన్యూ అయితే మాత్రం, ‘కేజీఎఫ్’ తర్వాత యష్ కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడా, లేక రాఖీ భాయ్ ఇమేజ్ ను మరో రెండు పాత్రల్లో పొడిగిస్తున్నాడా అనే విమర్శలు తప్పవు.