
ఆగస్టు 2026లో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి కొన్ని ప్రముఖ కంపెనీలు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్లు, లాయల్టీ ప్రయోజనాలు అందిస్తున్నాయి. టాటా మోటార్స్, కియా, హుండాయ్, హోండా బ్రాండ్స్ సెలెక్టెడ్ మోడళ్లపై ఈ నెలలో ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తున్నాయి.
టాటా మోటార్స్..
Tata Curvv – గరిష్ఠంగా రూ.లక్షా 25వేల వరకు ప్రయోజనాలు, ఇందులోనే ఈవీ కార్లకు రూ.3లక్షల 50వేల వరకూ తగ్గింపులు.
Tata Nexon – వేరియంట్‌ను బట్టి రూ.90వేల వరకు ప్రయోజనాలు.
Tata Altroz – గరిష్ఠంగా రూ.55వేల వరకు ప్రయోజనాలు.
Tata Tiago – ఎంపిక చేసిన వేరియంట్లపై రూ.35వేలు వరకు ప్రయోజనాలు. అదే ఈవీ వేరింట్ కి గరిష్టంగా రూ.లక్షా 45వేలు ఆఫర్ చేస్తోంది.
Tata Harrier – డీజిల్ వేరియంట్లపై రూ.45వేల వరకు, ఈవీ వేరియంట్ కి రూ.లక్షా 75వేల వరకూ బెనిఫిట్స్ అందిస్తోంది
Tata Safari – డీజిల్ మోడళ్లపై రూ.45వేల వరకు.
Tata Sierra Diesel – రూ.30వేల వరకు ప్రయోజనం.
కియా కార్స్.. ఆగస్టు 2026 ఆఫర్లు
Kia Seltos — గరిష్ఠంగా 40వేల రూపాయల వరకు ప్రయోజనాలు
Kia Sonet — గరిష్ఠంగా రూ.55వేల వరకు ప్రయోజనాలు
Kia Syros — గరిష్ఠంగా రూ.65వేల వరకు ప్రయోజనాలు
Kia Carens — గరిష్ఠంగా రూ.95వేల వరకు ప్రయోజనాలు
Hyundai Cars.. ఆగస్టు 2026 ఆఫర్లు
Hyundai Creta — గరిష్ఠంగా రూ.లక్ష వరకు ప్రయోజనాలు
Hyundai Verna — గరిష్ఠంగా రూ.85వేల వరకు ప్రయోజనాలు
Hyundai Grand i10 Nios — రూ.70వేల వరకూ ఆకర్షనీయమైన తగ్గింపులు
Hyundai Exter — రూ.65వేల వరకూ తగ్గింపులు
Hyundai i20 — రూ.60వేల వరకూ ఆకర్షనీయమైన తగ్గింపులు ఆఫర్
Honda Cars.. ఆగస్టు 2026 ఆఫర్లు
Honda Elevate — గరిష్ఠంగా రూ.లక్షా 55వేల వరకు ప్రయోజనాలు
Honda City — గరిష్ఠంగా రూ.85వేల వరకు ప్రయోజనాలు
Honda Amaze గరిష్టంగా రూ.40వేల వరకూ తగ్గింపుల ఆఫర్
ఇక్కడ పేర్కొన్నవి “గరిష్ఠంగా” లభించే ప్రయోజనాలు. మొత్తం ప్రతి కస్టమర్‌కు ఒకే విధంగా ఇవ్వకపోవచ్చు. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ లేదా నిర్దిష్ట వేరియంట్ అర్హతలను బట్టి తుది డిస్కౌంట్ మారుతుంది. కాబట్టి బుకింగ్‌కు ముందు మీ ప్రాంతంలోని డీలర్ నుంచి ఆఫర్ బ్రేకప్‌ను రాతపూర్వకంగా తీసుకోవడం బెటర్.
►ALSO READ | గోల్డ్, సిల్వర్‌పై టాక్స్ పెంపుతో మోడీ సర్కార్ 3 నెలల్లో ఎంత సంపాదించిందంటే..?