వర్షాకాలం రాగానే మార్కెట్లలో సందడి చేసే అరుదైన అడవి కూరగాయ బోడ కాకరకాయ. దీనినే ఆగాకరకాయ లేదా టీజెల్ గోర్డ్ అని కూడా అంటారు. సాధారణ కాకరకాయలా చేదుగా ఉండకపోవడం, తింటుంటే కరకరలాడుతూ ఉండటం దీని ప్రత్యేకత. రుచితో పాటు అపారమైన పోషకాలు నిండిన ఈ కూరగాయ మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో, ఏయే సమస్యలకు అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
షుగర్ వ్యాధికి చెక్: డయాబెటిస్‌తో బాధపడేవారికి బోడ కాకరకాయ ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉండే ప్లాంట్ ఇన్సులిన్, ఫైటోన్యూట్రియెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా అదుపులోకి తెస్తాయి. ఇక భోజనం తర్వాత రక్తంలో చక్కెర శాతాన్ని పెరగకుండా చూస్తూ, ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడేలా సహాయపడుతుంది.

గుండెకు కొండంత అండ: ఇందులో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇక రక్తం సరఫరా అయ్యే ధమనుల్లో కొవ్వు చేరుకోకుండా నిరోధించి, బీపీని అదుపులో ఉంచుతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తికి: అతి తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ఇది తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.
ప్రకృతి ప్రసాదించిన ఈ సీజనల్ కూరగాయను వర్షాకాలంలో అస్సలు మిస్ అవ్వకుండా మీ డైట్‌లో భాగం చేసుకోండి. రుచితో పాటు పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
గమనిక: బోడ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా మందులు వాడుతున్నవారు మీ ఆహార అలవాట్లలో పెద్ద మార్పులు చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది
The post ప్రకృతి ప్రసాదం బోడ కాకరకాయ.. డైట్‌లో చేర్చుకుంటే లాభాలివే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.