
నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో అర్థరాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. కాలనీలోని రఫీ ఇంటి సమీపంలో ప్రత్యక్షమైన ఈ కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సుమారు పది అడుగుల పొడవు, 20 కేజీలకు పైగా బరువున్న ఈ భారీ పామును చూసి కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ప్రముఖ స్నేక్ క్యాచర్ రజాక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగిన రజాక్‌కు ఓ క్రమంలో చుక్కలు చూపించింది ఆ భారీ కొండచిలువ. ఆయన గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు దానిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా కొండచిలువను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తూ క్రాంతినగర్ వాసులకు నిద్రలేకుండా చేస్తున్న భారీ కొండచిలువ చివరకు చిక్కడంతో స్థానికులు ఉపశమనం పొందారు. కొండచిలువను రజాక్ సురక్షితంగా సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
యూపీఐ సేవలు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. కేంద్రం కీలక ప్రకటన
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!