
హైదరాబాద్ లో మరో డేటింగ్ యాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వీడియో కాల్ చేసి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను ట్రాప్ చేసిన యువతి.. చివరకు రెండున్నర లక్షలు ఊడ్చేసింది. అతటితో వదలకుండా యువకుడి వీడియోలను అతడి కాంటాక్ట్ లిష్ట్ లో ఉన్న నంబర్లకు షేర్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో యువతి విసిరిన వలపు వలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలయ్యాడు. డేటింగ్ యాప్లో పరిచయమైన శిక్ష అనే యువతి.. సాఫ్ట్ వేర్ కు న్యూడ్ కాల్ చేసి టెంప్ట్ చేసింది. తను చూపించినట్లుగా చూపించాలని ఒత్తిడి చేయడంతో యువకుడు చెప్పినట్లు చేశాడు. దీంతో వీడియో కాల్ ను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
ఆ వీడియో కాల్ తరువాత బాధితుడికి టెలిగ్రామ్ లో ఒక లింక్ పంపింది యువతి. లింక్ క్లిక్ చేయడంతో బాధితుడి కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని సేకరించింది. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలను కాంటాక్ట్ లిస్టులో ఉన్న అందరికీ పంపుతానని బెదిరింపులకు గురిచేసింది. అలా 2 లక్షల 50 వేల రూపాయలు లాగింది.
అక్కడితో ఆగకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో తను ఇవ్వలేనని చెప్పాడు సదరు సాఫ్ట్ వేర్. దీంతో కాంటాక్ట్ లిస్టులో ఉన్న కొందరికి వీడియోలను షేర్ చేసింది. మరింత మందికి వీడియోలు పంపిస్తానని బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న మల్కాజ్ గిరి సైబర్ క్రైమ్ పోలీస్ లు.. దర్యాప్తు చేస్తున్నారు. డేటింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్ని హెచ్చరించారు.