
హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేశారు. ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు రిలీజ్ చేశారు. మొత్తం 95.51 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం గమనార్హం. టెన్త్ క్లాస్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. అమ్మాయిలు 96.26 శాతం ఉత్తీర్ణులు కావడం గమనార్హం. అబ్బాయిలు కూడా అమ్మాయిలకు ధీటుగా 94.07 శాతం ఉత్తీర్ణులయ్యారు.
మొదటి సారి వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. పదో తరగతి ఫలితాలను వాట్సప్లోనూ పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఎస్ఎస్సీ పరీక్షలకు అటెండ్ అయిన విద్యార్థులు ఇప్పుడు అధికారిక మీసేవా వాట్సప్ నంబర్ 80969 58096 ద్వారా పొందవచ్చని చెప్పారు. ఆ నంబర్కు Hi అని మెసేజ్ చేసి, ఎస్ఎస్సీ రిజల్ట్ అని టైప్ చేయాలి. మెనూలో ఓపెన్ సర్వీసెస్ ఎంపిక చేసుకొని, హాల్ టికెట్ నంబర్ ఇస్తే.. మార్కుల మెమో వస్తుంది.
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగ్గా.. మొత్తం 5 లక్షల 28 వేల మంది స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. విద్యార్థులు తమ రిజల్ట్ను https://results.bsetelangana.org, https://bse.telangana.gov.in , https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లలో తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
- మొత్తం 95.15 శాతం ఉత్తీర్ణత
- అబ్బాయిలు 94.07 శాతం పాస్
- అమ్మాయిలు బెస్ట్.. 96.26 శాతం పాస్
- 5 వేల 731 పాఠశాల్లలో వందకు వంద శాతం పాస్
- ఆరు ప్రైవేట్ స్కూల్స్ లో జీరో శాతం ఉత్తీర్ణత
- ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్.. రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత శాతం నమోదు
- హైదరాబాద్ తక్కువ శాతం ఉత్తీర్ణత.. 89.23 శాతం నమోదు..
- సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో 99.1 శాతం ఉత్తీర్ణత. ఇది రికార్డ్
- బీసీ వేల్ఫేర్ 98.99 శాతం పాస్
- టీజీ రెసిడెన్షనియల్ స్కూల్స్ లో 98.64 శాతం ఉత్తీర్ణత