
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న్నా ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ నోట్ రిలీజ్ చేసి ఆడియన్స్కి షాక్ ఇచ్చింది.
మొదట ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 4న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి వాయిదా వేస్తూ ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేశారు. అంతేకాకుండా మళ్ళీ రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చెప్పకపోవడం మరింత నిరాశ కలిగిస్తుంది.
మేకర్స్ విడుదల వాయిదాపై అధికారిక ప్రకటన చేస్తూ.. “సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే గ్లోబల్ రిలీజ్‌ను టార్గెట్ చేస్తూ, ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ మరియు ఇంటర్నేషనల్ పార్ట్నర్‌షిప్స్‌పై టీమ్ ఫోకస్ పెట్టింది. CinemaConలో వచ్చిన సూపర్ రెస్పాన్స్‌తో, ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని టీమ్ చెప్పింది.
ఈ క్రమంలోనే “కొన్ని సినిమాలు కేవలం తీస్తాం.. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనకి సినిమాపై ఉన్న ప్యాషన్‌ని గుర్తు చేస్తాయి. టాక్సిక్ అలాంటి స్పెషల్ జర్నీ” అని చెప్పి ఆడియన్స్ని హోల్డ్లో పెట్టారు.
— KVN Productions (@KvnProductions) April 29, 2026