Reading Time: < 1 minute

రాష్ట్రస్థాయికి కాగజ్‌‌నగర్ విద్యార్థుల ప్రాజెక్టులు

Caption of Image.

కాగజ్‌‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్​జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్టూడెంట్లు రూపొందించిన మూడు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలకు ఎంపికయ్యాయి. స్టూడెంట్లు తయారుచేసిన ‘స్మార్ట్ అటెండెన్స్ ట్రాకింగ్ సిస్టమ్’, ‘లాబొరేటరీ మీట్: ప్రయోజనాలు, చాలెంజెస్’, ‘మెన్స్ రోల్ ఇన్ లిటరేచర్’ ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. 

త్వరలో హైదరాబాద్‌‌లో జరిగే పోటీల్లో కాలేజీ విద్యార్థులు పాల్గొననున్నారని, ఒక్కో ప్రాజెక్టుకు రూ.25 వేల నగదు బహుమతి అందనుందని ఆమె పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.