
- హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల సమ్మతితోనే నగరంలోని స్లమ్ ఏరియాల్లో జీ +3, జీ+5 బిల్డింగులు నిర్మించనున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్మాట్లాడుతూ.. బస్తీల్లో ఇండ్ల నిర్మాణం కోసం రెండు వారాల నుంచి 26 బృందాలు పని చేస్తున్నాయన్నారు.
ఇప్పటివరకు 4,800 మంది సొంత జాగా ఉన్నవాళ్లు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 85 శాతం పైగా వెరిఫికేషన్పూర్తి చేసినట్టు చెప్పారు. మిగిలిన ప్రక్రియను వారంలోపు పూర్తి చేస్తామన్నారు. డబుల్ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల పురోగతిని సమీక్షించారు. ప్యారడైస్ జంక్షన్ నుంచి శామీర్పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు.
జిల్లా రెవెన్యూ ఇన్‌చార్జి ఆఫీసర్శ్రీధర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్రామకృష్ణ, పీడీ హౌసింగ్ అశోక్ చక్రవర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అపర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూ పరిమితి) శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.