Reading Time: < 1 minute

డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ గుండెపోటుతో మృతి..

Caption of Image.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో మరణించారు. అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ( ఏప్రిల్ 27 ) మరణించారు మధుసూదన్. ఆయన పలు ప్రముఖ సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. మధుసూదన్ కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

ఇవాళ మధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు చికిత్స సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న సమయంలో మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందారు మధుసూదన్.

మధుసూదన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని అన్నారు భట్టి. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు. మధుసూదన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నారు సీఎం రేవంత్.

©️ VIL Media Pvt Ltd.