
మనతెలంగాణ/హైదరాబాద్: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో 62 మంది విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను సిఎం రేవంత్‌రెడ్డి పంచుకున్నారు. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే ప్రొగ్రామ్ పై విద్యార్థులు ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు -15 నుండి -24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య పని చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు.