Reading Time: < 1 minute

రెబల్ స్టార్ ప్రభాస్… క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా వరుసగా షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది. ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది. దర్శకుడు హను రాఘవపూడి… ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.